రామ్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీవెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పక్కా లవ్ స్టోరీ అని టైటిల్ చూస్తేనే తెలుస్తుంది. కింగ్ నాగార్జున సూపర్ హిట్ సినిమా పాటని టైటిల్ గా పెట్టుకున్న రామ్ ఆ సాంగ్ లానే సినిమా హిట్ పక్కా అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడట.

నేను శైలజ తర్వాత హైపర్, ఉన్నది ఒకటే జిందగి రెండు సినిమాలు నిరాశ పరచే సరికి ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు రామ్. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో దర్శకుడిగా నక్కిన త్రినాథ రావు టాలెంట్ ఏంటో అర్ధమైంది అందుకే దిల్ రాజు ఈ క్రేజీ ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లుక్ చూస్తే రామ్ ను క్లాస్ గా చూపించినట్టు తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా రామ్ కోరుకునే హిట్ హలో గురు ప్రేమకోసమే ఇస్తుందా లేదా అన్నది చూడాలి.