
రంగస్థలం సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ కు గురిచేస్తుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే.. రాం చరణ్ బోయపాటి సినిమా ఇంద్ర-2 గా ఉంటుందని అని..
బి.గోపాల్ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఇంద్ర. అప్పట్లో రికార్డులు బద్ధలు కొట్టిన ఈ సినిమాతో మెగాస్టార్ మెగా మేనియా చాటాడు. ఇక ఆ సినిమాకు పోలికతో చరణ్ బోయపాటి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి ఉంది. జయ జానకి నాయకా సినిమా తర్వాత కొడితే బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్న బోయపాటి రంగస్థల బ్లాక్ బస్టర్ అందుకున్న రాం చరణ్ తో ఈ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.