తేజ మనసు మార్చుకున్నాడా..!

మహానటి సినిమా ఎఫెక్టో లేక మరే కారణమో కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ పై దర్శకుడు తేజ మనసు మార్చుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఎన్.టి.ఆర్ టైటిల్ తో సినిమా మొదలైంది. కొద్దిరోజులు షూటింగ్ జరిగిన తర్వాత తేజ నా వల్ల కాదని బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎవరెవరో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని వార్తలు రాగా ఫైనల్ గా చంద్ర సిద్ధార్థ్ పర్యవేక్షణలో బాలకృష్ణే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని అన్నారు. 

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సూపర్ హిట్ అవడంతో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై మరింత బాధ్యత పెరిగింది. అందుకే తేజ మనసు మార్చుకుని ఎన్.టి.ఆర్ సినిమా మళ్లీ టేకప్ చేస్తున్నాడని అంటున్నారు. ఈగో క్లాషెస్ వల్లే తేజ బయటకు వచ్చాడు. తేజ తనంతట తాను ఎనౌన్స్ చేసినా నిర్మాతలు ఇంకా ఈ విషయంపై స్పందించలేదు అందుకే సైలెంట్ గా అనుకున్న విధంగా షూటింగ్ కానిచ్చేదామని అనుకుంటున్నారట.    

మొత్తానికి మళ్లీ తేజ దర్శకత్వంలోనే ఎన్.టి.ఆర్ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే చిత్రయూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.