
మహానాటి సినిమా విజయవంతం అవడం ఒక విషయం అయితే ఈ సినిమా చూసిన సిని ప్రముఖులు చిత్రయూనిట్ ను ఆకాశానికెత్తేయడం మరో విశేషం. ఇప్పటికే ఎంతోమంది సిని సెలబ్రిటీస్ ఈ సినిమాపై తమ కామెంట్ తెలుపగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మహానటిపై తన స్పందన తెలియచేశారు. మహానటి ఓ అనుభవం. బహుశా కీర్తి సురేష్ తో సావిత్రి గారే అలా చేయించారేమో అని అన్నాడు ఎన్.టి.ఆర్.
కీర్తి సురేష్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదని.. సావిత్రి గారికి ఈ సినిమా ద్వారా ఘన నివాళి అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు అభినందనలు తెలియచేశారు ఎన్.టి.ఆర్. ఇక ఈ సినిమా నిర్మించిన స్వప్నా దత్, ప్రియాంకా దత్, అశ్వనిదత్ కు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్.టి.ఆర్. సినిమాలో నటించిన దుల్కర్, సమంత, విజయ్ లకు శుభాకాంక్షలు తెలిపాడు.