బిగ్ బాస్-2 మొదలు పెట్టారట..!

స్టార్ మా ప్రెస్టిజియస్ గా తెలుగులో మొదలు పెట్టిన రియాలిటీ షో బిగ్ బాస్. హిందిలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసి ఈ షోకి సూపర్ క్రేజ్ తీసుకురాగా తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసి అదరగొట్టాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సెకండ్ సీజన్ రెడీ అవుతుంది.

కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న నాచురల్ స్టార్ నానినే బిగ్ బాస్ సీజన్-2 కి వ్యాఖ్యాతగా చేస్తున్నాడని తెలుస్తుంది. దీనికోసం నానికి భారీగానే ఇస్తున్నారట. వరుస సినిమాలు ఉండటంతో బిగ్ బాస్ సీజన్-2 ఎన్.టి.ఆర్ చేసేందుకు వీలు కుదరలేదు. ఇక ఆ ప్లేస్ లో రానా, బన్ని ఇలా కొందరి పేర్లు వినిపించినా ఫైనల్ గా నానికి ఈ ఛాన్స్ వచ్చింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని బిగ్ బాస్ హోస్ట్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.