
వై.ఎస్.ఆర్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వై.ఎస్.ఆర్ గా మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. వై.ఎస్ రాజకీయ ప్రస్థానం ముఖ్యంగా అధికారంలోకి వచ్చే ముందు చేసిన పాదయాత్ర గురించి ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రస్థావించడం జరుగుతుందట.
రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వై.ఎస్ జగన్ గా తమిళ నటుడు సూర్య నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా వై.ఎస్.ఆర్ కు అత్యంత సన్నిహితుడు మిత్రుడు వైఎస్ తరపున రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టే కెవిపి పాత్రలో సహజ నటుడు రావు రమేష్ నటిస్తున్నారట. వై.ఎస్ ఆత్మగా చెప్పుకునే కెవిపికి ఈ యాత్ర సినిమాలో కూడా ప్రాధ్యాత ఉంటుందని తెలుస్తుంది.
అసలైతే కెవిపి పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను సంప్రదించారట. అయితే ఆయన డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో రావు రమేష్ ను ఫైనల్ చేశారట. లాస్ట్ ఇయర్ ఆనందో బ్రహ్మ సినిమాతో టాలెంట్ చూపించిన మహి వి రాఘవ్ యాత్ర సినిమాను ఎంతో ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నారు.