రవితేజ సిగ్గులేకుండా ఎలా చేస్తాడు : పవన్

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. ఈ సినిమా ఆడియో నిన్న జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ఈవెంట్ చాలా సరదాగా సాగింది. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతలను అలరిస్తున్నాయి. ఇక ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ తాను హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే రవితేజ హీరోగా ఉన్నారని ఆయన తనని గుర్తుపట్టని టైంలో అతనంటే తనకు ఇష్టమని అన్నారు పవన్ కళ్యాన్.

ఇక రవితేజలా సిగ్గు లేకుండా నటించడం చాలా కష్టం. అలా చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు పవన్. ఇక ఆయన చేసే కామెడీ వెనుక చాలా బాధ ఉంటుందని.. ఆవేదన, తపన ఉంటుందని రవితేజను పొగడ్తలతో కొనియాడారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా రవితేజ అలానే మాట్లాడారు. తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ లో పవన్ చేసిన సిగ్గులేకుండా ఎలా చేస్తారన్న కామెంట్ ఒకటని అన్నారు.. ఇక పవన్ కు మైక్ అందిస్తూ ది పవన్ ది కళ్యాన్ ది పవర్ ది స్టార్ అంటూ పవర్ స్టార్ మీద తన ఇష్టాన్ని తెలిపాడు రవితేజ.