సూర్య గురించి వింటున్నా.. త్వరలో చూస్తా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన నా పేరు సూర్య సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. థాంక్స్ టూ ఇండియా పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య గురించి మాట్లాడారు పవన్. వక్కంతం వంశీ కొమరం పులి టైం లో తనకు ఓ కథ చెప్పాడని కాని అది చేయడం కుదరలేదని అన్నారు. 

ఇక ఆర్య నుండి అల్లు అర్జున్ సినిమాలు చూస్తున్నానని మంచి సినిమాలు చేస్తూ తల్లిదండ్రులకు తాతగారికి మంచి పేరు తెస్తున్నాడని అన్నారు. నా పేరు సూర్య సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నదుకు సంతోషమని. నిర్మాత లగడపాటి శ్రీధర్ తన కోసం స్పెషల్ ఏర్పాటు చేస్తే చూస్తానని అన్నారు. సినిమా చూశాకే మళ్ళీ తన పర్యటన స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఇక ఇక్కడికి వచ్చేదాకా అన్న నాగబాబు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరని తనకు తెలియదని అన్నారు పవన్.