మెహబూబాపై మహానటి ఎఫెక్ట్..!

జీవిత చరిత్ర ఆధారంగా తీసే కథలో అంత కిక్ ఏముంటుంది అనుకున్న వారికి లేటెస్ట్ గా వచ్చిన మహానటి దిమ్మతిరిగి పోయేలా చేసింది. ఆ మహానటిని అభినయిస్తూ ఈమె మహానటిగా ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్. లీడ్ యాక్ట్రెస్ ఎంత అటెన్షన్ రాబట్టుకోవాలో అంతకుమించి ప్రేక్షకుల మనసు గెలిచింది మలయాళ భామ కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు పోటీగా రెండు రోజుల గ్యాప్ తో పూరి జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన మెహబూబా సినిమా వస్తుంది.

మే 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయినా సరే మహానటికి ఎక్కడ కనీసం యావరేజ్ అన్న టాక్ కాదు సూపర్ హిట్ అనేస్తున్నారు. ఆ మహానటి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించారంటూ ప్రశంసలు అందిస్తున్నారు. తప్పకుండా మెహబూబా సినిమాకు ఇది పెద్ద దెబ్బే. పూరి తనయుడు ఆకాష్ హీరోగా వస్తున్న ఈ మెహబూబా సొంత నిర్మాణంలో వచ్చింది. దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మెహబూబా మహనాటి దాటికి తట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.