
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తారు కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. రచయితగా సూపర్ హిట్ సినిమాలను అందించిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మారి తీసిన మొదటి సినిమా నా పేరు సూర్య. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు వక్కంతం వంశీ.
మొదటి సినిమా కాబట్టి కాస్త తడబాటు ఉంటుంది. నా పేరు సూర్యలో అది కనిపించినా దర్శకుడిగా మాత్రం వక్కతం వంశీకి మంచి మార్కులే పడినట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రేజ్ తో మళ్లీ మరో స్టార్ తో తన సెకండ్ సినిమా చేస్తున్నాడట వక్కంతం వంశీ. నా పేరు సూర్య నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మాణంలోనే ఆ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. మరి ప్రస్తుతం స్టార్స్ అంతా తమ సినిమాలతో బిజీగా ఉంటే వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చింది ఎవరని ఆరా తీస్తున్నారు. మరి అతనెవరో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.