
సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సావిత్రి జీవిత కథకు సంబంధించిన అందరు గురించి ప్రస్థావించడం జరిగింది. అయితే సావిత్రితో సినిమాలు చేసిన ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లలో ఏయన్నార్ పాత్రను ఏయన్నార్ మనవడు నాగ చైతన్య చేయడంతో కొన్ని సీన్స్ రాసుకున్నారు.
ఇక ఎటొచ్చి ఎన్.టి.ఆర్ గా జూనియర్ ను అడిగినా తిరస్కరించడంతో కేవలం ఒకే ఒక్కసారి నందమూరి తారక రామారావు అని అది కూడా గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారు. ఇంత గొప్ప బయోపిక్ లో ఎన్.టి.ఆర్ గా జూనియర్ ఎందుకు నటించనన్నాడు. నటించినంత మాత్రానా పోల్చినట్టు అవుతుందా అయినా ఏయన్నార్ గా నాగ చైతన్య కనిపించాడు కదా అని అందరు మాట్లాడుతున్నారు. ఇక మహానటి చూసిన నందమూరి ఫ్యాన్స్ అయితే కాస్త అసంతృప్తికి గురయ్యారని తెలుస్తుంది.