హాలీవుడ్ సినిమాకు నాని క్రేజ్..!

హాలీవుడ్ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ మీద బాగానే ప్రభావితం చూపిస్తాయి. ఓ పక్క రంగస్థలం, భరత్ అనే నేను సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంటే మరో పక్క ఎవెంజర్స్ కూడా ఇండియన్ బాక్సాఫీస్ పై సత్తా చాటుతుంది. అందుకే హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియన్ సినిమా మార్కెట్ పై దృష్టి పెడతారు. ఇక లాస్ట్ ఇయర్ డెడ్ పూల్ విజయం సాధించగా ఇప్పుడు దానికి సీక్వల్ గా డెడ్ పూల్-2 తీస్తున్నారు.

త్వరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫాక్స్ స్టార్ ఇండియా వారు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు నానిని ప్రమోషన్స్ కు వాడుతున్నారు. నాచురల్ స్టార్ గా నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు నాని క్రేజ్ ను హాలీవుడ్ సినిమాకు ఉపయోగించుకుంటున్నారు. మరి నాని ప్రమోట్ చేస్తున్న డెడ్ పూల్-2 ఎలా ఉండబోతుందో చూడాలి.