
ఖైది నంబర్ 150తో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి బయోపిక్ లో నటిస్తున్న చిరంజీవి పూర్తి ఫోకస్ ఈ సినిమా మీదే పెట్టినట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ ను 2019 మే 9న ఫిక్స్ చేశారట. మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు మే 9నే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ మెగా సెంటిమెంట్ తోనే 2019 మే 9న సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. భారీ తారాగణంతో 150 కోట్ల పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ కానుంది.