
అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుశాంత్ హీరోగా నిలదొక్కుకునేందుకు తన ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు. నిన్న కాక మొన్నొచ్చిన హీరోలు కూడా స్టార్ క్రేజ్ దక్కించుకుంటుంటే సుశాంత్ మాత్రం కనీస ప్రేక్షకాదరణ పొందలేదు. సుమంత్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండగా ఈమధ్యనే మళ్లీ రావా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు.
ఇక సుశాంత్ కూడా అదే బాటలో చి.ల.సౌ సినిమాతో వస్తున్నాడు. టీజర్ చూస్తే చాలా ఫ్రెష్ గా ఉంది. పెళ్లికోసం ఇంట్లో వాళ్లు తొందరపెడుతుంటే సుశాంత్ ఎలా వాటి నుండి తప్పించుకున్నాడు అన్నది సినిమా కథ. చూస్తుంటే కచ్చితంగా సుశాంత్ ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే యువ హీరో రాహుల్ రవింద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాజశ్వంత్ నిర్మిస్తున్నారు. సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చి.ల.సౌ ఎలా ఉంటుందో చూడాలి.