
పెళ్లిచూపులు హీరోగా కన్నా అర్జున్ రెడ్డి తర్వాత స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈతరం హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ట్యాక్సీవాలా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురాం డైరక్షన్ లో గీతాగోవిందం సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది. ఈ రెండిటితో మాత్రమే ఆగకుండా భరత్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు టైటిల్ గా డియర్ కామ్రేడ్ అనేది పరిశీలణలో ఉందట. పెళ్లిచూపులు నిర్మాతల్లో ఒకరైన యాష్ రంగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వయొలెంట్ లుక్ తో విజయ్ అదరగొట్టగా సినిమా కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటిదాకా తన సినిమాల్లో హైదరాబాద్ తెలగాణా స్లాంగ్ వాడిన విజయ్ దేవరకొండ మొదటిసారి కాకినాడ యాసలో మాట్లాడబోతున్నాడట. మరి అర్జున్ రెడ్డి లానే డియర్ కామ్రేడ్ విజయ్ క్రేజ్ ను పెంచాలని ఆశిద్ధాం.