
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కతం వంశీ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా చేసిన సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని అంటున్నారు. వీకెండ్ కలక్షన్స్ కూడా నార్మల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చాడన్న అభిమానంతో వక్కంతం వంశీ నా మూడున్నర ఏళ్ల కలను తీర్చిన మగాడు అని కామెంట్ చేశాడు.
అయితే ఇది ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా వంశీ కామెంట్ చేశాడని ట్రోలింగ్స్ చేశారు. అయితే నా పేరు సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత కూడా వక్కంతం వంశీ ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నారు. కేవలం తన కథను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో అల్లు అర్జున్ అందుకే ఆ సమయంలో అలా అన్నానని చెప్పారు వక్కంతం వంశీ.
ఓవరాల్ గా మొదటి అవకాశం ఇచ్చిన హీరో కాబట్టి ఆ హీరోని ఆమాత్రం పొగడటంలో తప్పేం లేదు. కాని ఎన్.టి.ఆర్ తో సత్సంబంధాలున్న వంశీ ఈ విధంగా మాట్లాడటం పై ఇష్యూ రేజ్ అయ్యింది. ఇక నా పేరు సూర్య కథ కూడా ఎన్.టి.ఆర్ కోసం రాసుకున్నాడని వచ్చిన వార్తలను కూడా వాస్తవం లేదని వివరణ ఇచ్చారు వంశీ.