
మిర్చి నుండి లేటెస్ట్ సూపర్ హిట్ భరత్ అనే నేను దాకా తీసిన నాలుగు సినిమాలతోనే స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ భరత్ అనే నేను సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. అసలైతే చరణ్, బన్నిలతో సినిమాలంటూ వార్తలు వస్తున్నా అవేవి నిజం కాదని తెలుస్తుంది.
రీసెంట్ గా అక్కినేని యువ హీరో అఖిల్ తో కొరటాల శివ సినిమా అంటూ వార్తలొచ్చాయి. అది కూడా వాస్తవం కాదని తెలుస్తుంది. ఇక ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం భరత్ అనే నేను సినిమా చూసిన మెగాస్టార్ స్పెషల్ గా కొరటాల శివకు ఫోన్ చేసి విశెష్ చెప్పారట. ఇక తనకు సరిపడ కథ ఉంటే తీసుకురమ్మని చెప్పినట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ తో సినిమా అంటే ఇక ఆ లెక్క ఎలా ఉంటుందో చెప్పొచ్చు. కొరటాల శివ లాంటి కంటెంట్ ఉన్న డైరక్టర్ మెగాస్టార్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు.