అల్లు అర్జున్ ది రియల్ సోల్జర్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. అంచనాలను అందుకునేలా లేకున్నా బన్ని నటనతో ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి. అయితే ఈ సినిమా థ్యాంక్స్ మీట్ లో సినిమా గురించి మాట్లాడుతూ మేజర్ శ్రీనివాసరావు అల్లు అర్జున్ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలని సూచించారు. సినిమా చూసి ఆయన ఈ మాట అనడం జరిగింది. 

ఇక శ్రీనివాసరావు మాటకు రెస్పాన్స్ గా సినిమా చేస్తున్నప్పుడే తనకు ఈ ఆలోచన వచ్చిందని.. ఇప్పటికే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తో అప్లై చేశానని అన్నారు అల్లు అర్జున్. ఏదో సినిమాలో క్యారక్టర్ చేశాం అని కాకుండా ఆ పాత్ర ఒరిజినాలిటీని అనుభూతి పొందాలని బన్ని చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్, సచిన్, ధోని ఆర్మీ ఆఫీసర్స్ గా ఉన్నారు. వారి దారిలోనే అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.