రవితేజ కోసం పవన్ వస్తున్నాడు.. అంతే..!

పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్య సినిమా వేడుకలకు ఇలా పిలవగానే అలా వచ్చేస్తున్నాడు. రీసెంట్ గా తన సమర్పణలో వచ్చిన నితిన్ ఛల్ మోహన్ రంగ, రాం చరణ్ రంగస్థలం సినిమాల ఈవెంట్ లకు అటెండ్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజ నేల టికెట్ ఆడియోకి వస్తున్నాడని తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న నేల టికెట్ సినిమా ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా ఆడియోకి పవన్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అవబోతున్నారట. చిరంజీవి ఫ్యామిలీతో మంచి సత్సంబంధాలున్న రవితేజ కెరియర్ లో ఎదిగేందుకు మెగాస్టారే తనకు స్పూర్తి అని చాలా సార్లు చెప్పాడు కూడా. అందుకే ఆ మెగా సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ తో తన సినిమా ఆడియో వదులుతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత కళ్యాణ్ కృష్ణ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.