
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2017కు గాను మోస్ట్ డిజైరబుల్ మెన్ గా ప్రకటించిన లిస్టులో టాప్ 10లో తెలుగు హీరోలు ముగ్గురు ఉండటం విశేషం. 2016లో 22వ స్థానంలో ఉన్న ప్రభాస్ బాహుబలి-2 క్రేజ్ తో టాప్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఇక మహేష్ బాబు ఎప్పటిలానే 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇక భళ్లాలదేవ కూడా మహేష్ తర్వాత అనగా 7వ స్థానంలో ఉన్నాడు. బాహుబలితో ప్రభాస్ నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఏకంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లిని కూడా నెట్టేసి తన స్థానంలో నిలిచాడు ప్రభాస్. ప్రస్తుతం విరాట్ కొహ్లి 3వ స్థానంలో ఉన్నాడు. నేషనల్ వైడ్ గా 2017లో ఎవరికి ఎంత పాపులారిటీ ఉంది అన్నది ఈ లిస్ట్ చూస్తే అర్ధమవుతుంది.