క్వీన్ రీమేక్ అ! దర్శకుడి చేతుల్లోకి..!

బాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న క్వీన్ మూవీ సూపర్ హిట్ అవడమే కాదు కంగానా రనౌత్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఆ సినిమా రీమేక్ గా సౌత్ అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని చూశారు. తెలుగులో ఆల్రెడీ ఓ దర్శకుడి చేతుల్లోంచి నీలకంఠ చేతుల్లోకి రాగా మళ్లీ ఇప్పుడు అతను కూడా ఆ సినిమా నుండి తప్పుకున్నాడట.

ఇక ఇప్పుడు ఈ క్రేజీ ఆఫర్ అ! సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మని వరించిందని తెలుస్తుంది. దర్శకుడిగా మొదటి సినిమానే ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కచ్చితంగా క్వీన్ సినిమాకు న్యాయం చేస్తాడని మేకర్స్ అనుకున్నారట. ఇక ఆలోచన రావడం అతనికి ఫోన్ వెళ్లడం ప్రశాంత్ కూడా ఓకే చెప్పడం అంతా జరిగిందట. తమన్నా హీరోయిన్ గా నటించబోయే ఈ సినిమా ప్రశాంత్ టేకింగ్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.