షాక్ ఇస్తున్న రజిని రెమ్యునరేషన్..!

సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం కాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జూన్ 7న కాలా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ మాత్రం ఇంకా రిలీజ్ కన్ ఫాం అవ్వలేదు. ఇక ఈ సినిమాల తర్వాత రజిని కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. రజినికాంత్ 165వ సినిమాగా వస్తున్న ఆ సినిమాకు రెమ్యునరేషన్ గా 65 కోట్ల దాకా తీసుకుంటున్నాడట రజినికాంత్.

రజినికాంత్ సినిమా అంటే బాక్సాఫీస్ కు సందడి మొదలైనట్టే. అయితే సినిమా హిట్ అయితే ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఓ లెక్క లేది కాదు. రజిని రేంజ్ తెలిపేలా తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఉండటం విశేషం. సౌత్ లోనే కాదు బాలీవుడ్ స్టార్స్ లో కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకునే వారు లేరని చెప్పొచ్చు. ప్రస్తుతం కాలా రిలీజ్ కు సిద్ధమవుతుండగా రోబోని శంకర్ ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. ఈ రెండు సినిమాలు మళ్లీ రజిని క్రేజ్ ను పెంచుతాయని చెబుతున్నారు.