
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న నా పేరు సూర్య సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో సాంగ్ మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రియులను అలరించింది. ఈ సినిమాలో బన్ని క్యాప్ డ్యాన్స్ అదిరిపోయింది. అయితే ఇది గ్రాఫిక్స్ అనుకున్నారు అంతా నెగటివ్ ట్రోల్స్ కూడా బాగానే వచ్చాయి.
అందుకే సినిమా నిర్మాతలు సినిమాలో ఆ క్యాప్ డ్యాన్స్ కోసం బన్ని ఎంత కష్టపడ్డాడు అన్నది వీడియో రిలీజ్ చేశాడు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేలా ఆ క్యాప్ డ్యాన్స్ కోసం బన్ని ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు బన్ని ది ఒరిజినల్ డ్యాన్సర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు.