తాత పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..!

మహానటి సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో నిన్న జరిగింది. ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఆడియోలో తాత పాత్ర గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడు తారక్. తాత పాత్ర చేసే అర్హత తనకు లేదని. ఇప్పుడే కాదు తను ఎప్పుడు ఆ సాహసం చేయనని ఫైనల్ క్లారిటీ ఇచ్చేశాడు ఎన్.టి.ఆర్.

మహానటి నిర్మాత స్వప్న తాత ఎన్.టి.ఆర్ రోల్ లో నటించాలని సంప్రదించినా దానికి ఎన్.టి.ఆర్ మాత్రం నో అని చెప్పాడట. మహానటిలో నటించిన కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, విజయ్, సమంతలను మెచ్చుకున్నాడు ఎన్.టి.ఆర్. రియల్ లైఫ్ పాత్రలని అంత తేలికైన విషయం కాదని అందుకు ఈ సినిమా స్టార్ కాస్ట్ కు హ్యాట్సాఫ్ చెప్పాడు.