భరత్ అనే నేను.. ఆ సీన్ కు క్లాప్స్ కొట్టిన చిరంజీవి..!

 మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే సెలబ్రిటీస్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా చూసి నిర్మాత డివివి దానయ్యకు, దర్శకుడు కొరటాల శివకు కంగ్రాట్స్ చెప్పిన విషయం బయటకు వచ్చింది. కాని ఇప్పుడు స్వయంగా మెగాస్టారే భరత్ గురించి ప్రస్థావించడం జరిగింది.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఏర్పరచిన ఇంటరాక్షన్ ఈవెంట్ లో భాగంగా డల్లాస్ లో ఏర్పరచిన ప్రోగ్రాం లో చిరంజీవి పాల్గొన్నారు. అప్పుడే భరత్ అనే నేను సినిమా తాను రిలీజ్ నాడే స్పెషల్ స్క్రీనింగ్ లో చూశామని చెప్పారు. తన కుటుంబంలో అందరు మహేష్ ను ఇష్టపడతామని చెప్పిన చిరు భరత్ అనే నేను సినిమాలో మహేష్ నటన అద్భుతమని కితాబిచ్చారు. అంతేకాదు ఆ ప్రెస్ మీట్ సీన్ లో అయితే చిరంజీవి క్లాప్స్ కొట్టేంతగా నచ్చిందని అన్నారు.