
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా తేజ్ ఐ లవ్యూ. కె.ఎస్ రామారావు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది. సాయి ధరం తేజ్ లుక్ ఎప్పటిలానే బాగుంది. అనుపమ కూడా ఆకట్టుకుంది.
ప్రేమకథల్లో తన మార్క్ చూపించే కరుణాకరణ్ ఓ క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కు ఈ సినిమా హిట్ అయ్యి తీరాల్సిందే. వినాయక్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమాతో కెరియర్ లో మరింత వెనక్కి వెళ్లిన తేజూ ఈ లవ్ స్టోరీతో పక్కా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.