ఎన్టీఆర్ ను ఒప్పించిన మహానటి టీం..!

అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ మహానటి సావిత్రిగా నటిస్తుండగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ లో ప్రియాంకా దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ పాత్రలకు వారి మనవళ్లను నటింపచేయాలని ప్రయత్నం చేశారు. ఏయన్నార్ గా నాగ చైతన్య ఓకే చెప్పగా సీనియర్ ఎన్.టి.ఆర్ గా జూనియర్ ససేమీరా కుదరదని చెప్పాడు.

తారక్ చేయడని ఫిక్స్ అయిన చిత్రయూనిట్ ఎన్.టి.ఆర్ కోసం వేరే అరేంజ్ మెంట్ ఏర్పాటుచేశారు. అయితే సినిమాలో నటించకున్న సినిమా ప్రమోషన్ కోసం మాత్రం తారక్ ఓకే చెప్పాడు. ఆ క్రమంలో భాగంగా మహానటి ఆడియో వేడుకకి ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈరోజు సాయంత్రం మహానటి ఆడియో రిలీజ్ కాబోతుంది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మే 11న రిలీజ్ కు సిద్ధమవుతుంది.