
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా సినిమా చేస్తున్నాడు. పూరి దర్శక నిర్మాతగా వస్తున్న ఈ సినిమా మే 11న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన పూరి తన ఐపాడ్ లో మూడేళ్లకు సరిపడ సినిమాలున్నాయని అంతేకాదు పదేళ్లకు సరిపడ కథలను తాను సిద్ధం చేసుకున్నానని అన్నాడు పూరి.
ఫ్లాపులొచ్చినా సరే స్టార్ హీరోలు ఇప్పటికి తనతో సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నారని. అయితే మెహబూబా తర్వాత మళ్లీ ఆకాష్ తోనే మరో రెండు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడు పూరి. హిట్లు ఫ్లాపులతో తనకు సంబంధం లేదని తన సినిమాలు ఫ్లాప్ అయినా హీరోలకు మంచి పేరే వచ్చిందని అన్నాడు పూరి.
ఇక మెహబూబా మనసు పెట్టి తీసిన సినిమా అని అంటున్న పూరి సినిమా ఫలితంపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆకాష్ తో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.