
నాచురల్ స్టార్ నాని వరుసగా 8 సినిమాలను హిట్లు అందుకున్న క్రేజీ హీరో. అయితే 2018లో మొదట్లోనే నానికి నిరాశ మిగిలింది. తను హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. నానిని కేవలం పక్కింటి కుర్రాడిగా మాత్రమే చూస్తారని మళ్లోసారి ప్రూవ్ చేశారు ఆడియెన్స్. అయితే ఈ సినిమా ఇచ్చిన షాక్ కు నాని కాస్త ఆలోచనలో పడ్డాడు.
ప్రస్తుతం నాగార్జునతో శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు నాని. అది పూర్తయ్యాక అసలైతే విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. కాని అది ప్రస్తుతం వద్దనుకుంటున్నాడని తెలుస్తుంది. విక్రం కుమార్ తీసిన సినిమాల్లో ఇష్క్, మనం హిట్ అయ్యాయి. ఈ టైం లో అతనితో సినిమా చేయడం రిస్క్ అని వెనక్కి తగ్గాడట నాని. మరి ప్రస్తుతం వద్దన్నాడో అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ చేశాడో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.