
భరత్ అనే నేను సినిమా మహేష్ ను ఎంత ఉత్సాహపరచిందో ఆయన్ను చూస్తే తెలిసిపోతుంది. ఇక సినిమా సక్సెస్ మజా ఎంజాయ్ చేస్తున్న మహేష్ కొద్ది గంటల క్రితం జరిగిన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో అద్భుతంగా మాట్లాడాడు. ముఖ్యంగా కొరటాల శివ గురించి చెబుతూ అందరు తనని సూపర్ స్టార్ అని పిలుస్తున్నా ఈ సూపర్ స్టార్ కు నాలుగు సంవత్సరాల్లో 2 లైఫులు ఇచ్చిన వ్యక్తి శివ అని అన్నారు.
ఇక సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నికల్ టీం ను పొగుడుతూ మాట్లాడిన మహేష్ అమ్మ పుట్టినరోజు ఏప్రిల్ 20న సినిమా రిలీజ్ అయ్యింది మే 31 నాన్న గారి పుట్టినరోజు దాకా ఇలానే షేర్స్ గురించి మాట్లాడాలని అన్నారు. ఇక సినిమాకు ఇలా షీల్డులిచ్చి చాలా రోజులయ్యిందని ఈ సినిమాకు ఇవ్వడం చాలా మంచిగా అనిపించిందని అన్నారు మహేష్. ఇక ఫ్యాన్స్ కోసం ఇక నుండి శ్రద్ధతో అంతః కరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అంటూ తన స్పీచ్ ముగించారు. సినిమా అంటే ఈ రకమైన భక్తి భావనలు ఉండటం గొప్ప విషయం.. అవే మహేష్ ను సూపర్ స్టార్ ను చేశాయని చెప్పొచ్చు.