
సినిమా సినిమాకు గ్యాప్ మధ్యలో మహేష్ తన ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేస్తుంటాడు. అయితే భరత్ అనే నేను సినిమాకు ముందే ఓ 4 డేస్ అలా విదేశాలకు వెళ్లొచ్చాడు. సినిమా తేడా కొడితే పరిస్థితి కాస్త అయోమయంగా ఉంటుందని తెలిసి మహేష్ భరత్ సినిమా రిలీజ్ ముందు దాకా బాగా టెన్షన్ పడ్డాడని తెలుస్తుంది. ఇక రిలీజ్ డే ముందు రోజు రాత్రి అయితే అసలు నిద్రపోలేదట.
ఇక మిడ్ నైట్ అయ్యాక అలా కునుకు తీశాక సరిగా 2 గంటల ఆ టైంలో నమ్రత వచ్చి సినిమా టాక్ చెప్పిందట. యూఎస్ లో హిట్ టాక్ వచ్చిందని చెప్పగానే ఆమె కళ్ల నీళ్లు తుడిచి మహేష్ ఆమెకు ఓ ముద్దు పెట్టాడట. అది ఎమోషనల్ గా పెట్టిన ముద్దు. అదే తన ఇన్స్ స్టాగ్రాంలో షేర్ చేశాడు మహేష్. అయితే హాలీడే ట్రిప్ లో ఎప్పుడు ఫోటోలు పెట్టినా ఫాలో అయ్యే వారు తప్ప వాటి గురించి మాట్లాడేవారు కాదు కాని మహేష్ నమ్రత ముద్దు పిక్ మాత్రం ఎన్నో డిస్కషన్స్ కు దారి తీస్తుంది. మహేష్ ఈ వివరణ ఇచ్చాడు కాబట్టి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.