
రంగస్థలం సూపర్ హిట్ తో ఫుల్ ఖుషిగా ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నాడని అన్నారు. ఇక ఇప్పుడు సినిమాలో మరో విలన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా నటించిన సుదీప్ బోయపాటి చరణ్ సినిమాలో ఛాన్స్ పట్టేశాడట.
కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్ తెలుగులో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో ఓ క్రేజీ రోల్ కు సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మాస్ అండ్ కమర్షియల్ సినిమాల్లో తన సత్తా చాటే డైరక్టర్ బోయపాటి శ్రీను చరణ్ తో ఎలాంటి సినిమా తీస్తున్నాడో అని మెగా ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.