
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్.జె. సూర్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖుషి. 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో యూత్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా భూమిక యువత మనసులను గెలిచేలా చేసింది ఈ సినిమా. సూర్య మూవీ బ్యానర్లో ఏ.ఎం.రత్నం ఈ సినిమా నిర్మించడం జరిగింది.
ఈరోజుకి ఖుషి సినిమా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆరోజులను గుర్తుచేసుకునేందుకు ఖుషి నిర్మాత ఏ.ఎం.రత్నం పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్ లో కలిసి గ్రీటింగ్స్ తెలిపాడు ఏ.ఎం.రత్నం. ఎస్.జే సూర్య ఆ తర్వాత మహేష్ తో నాని సినిమా తీశాడు కాని వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు అతను కూడా నటుడిగా మారి బిజీ అయ్యాడు.
ఖుషికి సీక్వల్ గా ఖుషి-2 వస్తుందని అభిమానులు భావించినా సూర్య అందుకు తగిన స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడంతో వెనుకపడ్డది. ప్రస్తుతం పవన్ తన పూర్తి దృష్టి రాజకీయాల మీదే పెట్టాడు. పవన్ తో సినిమా చేయాలంటే దాదాపు మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.