అ! దర్శకుడితో రాజశేఖర్..!

నాని నిర్మాణంలో అ! అంటూ టోటల్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరచేలా సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సెకండ్ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు. అసలైతే అ! తర్వాత నాని హీరోగా ఓ సినిమా చేస్తాడని చెప్పగా ఇప్పుడు అతన్ని కాదని యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. రీసెంట్ గా గరుడవేగ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కిన రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కథకు ఫిదా అయ్యాడట.

ఈ కథ కూడా అ! సినిమాలానే థ్రిల్లర్ గా ఉండబోతుందట. కచ్చితంగా మళ్లీ రాజశేఖర్ కు ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు రాజశేఖర్ ఓకే చెప్పాడట. ఈ సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ తెలియాల్సి ఉంది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.