
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాక్ష్యం. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన శ్రీనివాస్ ఆ సినిమా కన్ఫాం చేశాడు. నాని నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందట.
ఇప్పటికే సినిమాలో ఒక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేయగా.. సెకండ్ హీరోయిన్ గా అమీ జాక్సన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఎవడు సినిమాతో తెలుగులో చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్ ఆ తర్వాత ఇక్కడ నటించే ఛాన్స్ రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ ఆ ఛాన్స్ కొట్టేశాడు. మొదటి సినిమా అల్లుడు శీను నుండి హీరోయిన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవని శ్రీనివాస్ అమీ జాక్సన్ తో జోడి కట్టడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది.