భరత్ ప్రేయసికి లక్కీ ఛాన్స్..!

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన భామలకు స్టార్ అవకాశాలు వస్తాయి. ఇక స్టార్ సినిమాతో వచ్చి హిట్ అందుకుంటే ఇక ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ప్రస్తుతం కైరా అద్వాని పొజిషన్ అలానే ఉంది. సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో హిట్ అందుకున్న అమ్మడు ఆ సినిమా రిలీజ్ కాకముందే రాం చరణ్, బోయపాటి శ్రీను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో రాబోతున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. భరత్ అనే నేనులో ఆమెది అంత ఇంపార్టెంట్ ఉన్న పాత్ర కాకపోయినా భరత్ లవర్ గా కైరా మనసులను గెలిచింది. కనిపించిన కొద్దిసేపైనా ఆడియెన్స్ ను అలరించింది కాబట్టి ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. 

భరత్ అనే నేను సినిమా చూసిన రాజమౌళి తన సినిమాలో ఒక హీరోయిన్ గా కైరాని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. చూస్తుంటే అమ్మడు తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సింది లేదని అంటున్నారు.