
స్టైలిష్ స్టార్ అల్లు అరున్ వక్కంతం వంశీ కాంబోలో వస్తున్న సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బన్ని వాసు, నాగబాబు సహ నిర్మాతలుగా ఉంటున్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కు విశేష స్పందన వచ్చింది.
ఇక రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు నా పేరు సూర్యకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఆడియో పశ్చిమ గోదావరి జిల్లాలో చేస్తున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ టీం నుండి కూడా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బన్ని తన ఖాతాలో మరో హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.