పరిశ్రమకు తలసాని హామి..!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తలెత్తిన కాస్టింగ్ కౌచ్ వివాదంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ రంగంలో ఉన్న లైంగిక వేధింపులపై చర్చలు జరిపారని తెలుస్తుంది. సినిమా పరిశ్రమలోని సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకునేలా దృష్టి సారిస్తామని చెప్పారు. కో ఆర్డినేటర్ విధానం లేకుండా ప్రొడక్షన్ నుండే ఆర్టిస్టులకు డబ్బులు అందేలా కార్యచరణలు ప్రవేశ పెడతామని.. ఒకవేళ ఎక్కడైనా వేధింపులు జరిగితే వారు డైరెక్ట్ గా పోలీసులకు చెప్పుకునేలా ఎఫ్డిసి లో కూడా సెపరేట్ సెల్ ఏర్పాటు చేస్తామని అయ్యారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు, సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు, సినీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. వీలైనంత త్వరలో సిని పరిశ్రమకు సంబందించి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక నుండి ఇలాంటివన్ని ఆపేయాలని మంత్రి తలసాని కోరారు.