శ్రీరెడ్డి లీక్స్.. నిర్మాత తనయుడెవరంటే..!

కొద్దిరోజులుగా కాస్టింగ్ కౌచ్ గురించి టివిల్లో, యూట్యూబ్ ఛానెల్స్ లో రకరకాల వార్తలతో హల్ చల్ చేస్తున్న శ్రీరెడ్డి రోజుకో సంచలన వార్తతో ముందుకొస్తుంది. ఇక లేటెస్ట్ గా బడా నిర్మాత సురేష్ బాబు తనయుడు తనని దారుణంగా మోసం చేశాడని ట్విట్టర్ లో పెట్టింది శ్రీరెడ్డి. బడా బాబుల పేర్లను ఏమాత్రం భయం లేకుండా బయటపెడుతుంది శ్రీరెడ్డి. 

ఇక టివి ఛానెళ్లు శ్రీరెడ్డి ఇంటర్వ్యూస్ తో నానా హంగామా సృష్టిస్తున్నారు. ఈమధ్యనే శ్రీరెడ్డి ఫిల్మ్ చాంబర్ ముందు చేసిన అర్ధ నగ్న ప్రదర్శనతో ఈ న్యూస్ నేషనల్ మీడియాకు పాకింది. ఆమె ప్రవర్తన సరిగా లేదని మా మెంబర్ షిప్ కూడా ఇవ్వడం కుదరదని చెప్పారు. ఆమెతో కలిసి సినిమా చేసినా వారిని సస్పెండ్ చేస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సభ్యులు చెప్పారు.