పెళ్లైతే పనికిరారా.. ఈ పద్ధతి మారాలి..!

టాలీవుడ్ లోనే కాదు ఏ పరిశ్రమలో అయినా సరే పెళ్లైన హీరోయిన్స్ అంటే అయిష్టత ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించడం పక్కన పెడితే ముందు దర్శక నిర్మాతలే పెళ్లైన హీరోయిన్స్ కు అవకాశం ఇవ్వరు. ఈ పద్ధతి మారాల్సిందే అంటుంది సమంత. పెళ్లి తర్వాత కూడా తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని. రంగస్థలం రామలక్ష్మి పాత్రలో ప్రేక్షకులు తనని యాక్సెప్ట్ చేశారని అంటుంది.

రంగస్థలం ప్రమోషన్స్ లో మాట్లాడిన సమంత అక్కినేని కోడలిగా తనకు అక్కినేని, దగ్గుబాటి రెండు కుటుంబాల సపోర్ట్ వల్ల 200 పర్సెంట్ వర్క్ మీద ఫ్రీ మైండ్ తో వెళ్లగలుగుతున్నా అని అంటుంది సమంత. సెలెక్టెడ్ సినిమాలను చేస్తే పెళ్లైన హీరోయిన్స్ ఓకే కాని పెళ్లికి ముందులా రెచ్చిపోవడం కుదరదని చెప్పొచ్చు. ప్రస్తుతం కన్నడ మూవీ యూటర్న్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సమంత తదుపరి సినిమా ఏంటన్నది మాత్రం చెప్పలేదు.