
అసలే సమ్మర్ అంటే ఆపైన అమ్మడు మరింత హీటు పెంచేస్తుంది. డీజేతో బికిని బేబ్ గా క్రేజ్ తెచ్చుకున్న పూజా టాలీవుడ్ లో వరుస స్టార్ అవకాశాలను అందుకుంటూ కెరియర్ పీక్స్ లోకి వెళ్లింది. ఇక ఫ్యాన్స్ ను మరింత డిస్ట్రబ్ చేసేలా అమ్మడు ఫెమినా కోసం బికిని స్టిల్స్ ఇచ్చింది. బికిని లో భామను చూస్తే హృదయం గిలిగింతలు పెట్టేయడం ఖాయం.
డీజేకి ముందు రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్ బన్ని పక్కన నటించే సరికి వచ్చేసింది. వరుసగా మహేష్, ఎన్.టి.ఆర్ సినిమాల్లో సెలెక్ట్ అయిన అమ్మడు బికిని లుక్స్ తో జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీను సాక్ష్యం సినిమాలో నటిస్తున్న ఈ భామ ఇక్కడ జెండా పాతేయాలని చూస్తుంది. ఫెమినా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మరింత ఎట్రాక్ట్ చేస్తున్న అమ్మడు చూస్తుంటే టాలీవుడ్ స్టార్ కిరీటం దక్కించుకునేట్టే ఉంది.