ఇద్దరు స్టార్లు ఒకే వేదికపై.. మహేష్ అన్న అంటూ మనసులు గెలిచిన ఎన్టీఆర్..!

సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. మహేష్ అన్నా అంటూ ఆప్యాయంగా మాట్లాడిన తారక్ అందరి మనసులను గెలిచాడు. కమర్షియల్ హీరోగా మహేష్ అన్న చేసిన ప్రయోగాలు ఎవరు చేయలేదని మేము ఇప్పుడే చేయడం మొదలు పెట్టామని అన్నాడు ఎన్.టి.ఆర్. 

మాలాంటి వారందరికి మహేష్ అన్న ఇన్ స్ప్రేషన్ అని అన్నాడు. ఇక జంతా గ్యారేజ్ లో ఓ డైలాగ్ ప్రస్థావిస్తూ అందులో డైలాగ్ లానే మహేష్ అన్న అరుదైన హీరో ఆయన్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని అన్నాడు. ఆ తర్వాత మాట్లాడిన మహేష్ కూడా తారక్ తమ్ముడు గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు.  

ఇక నుండి ఇదో ట్రెండ్ మారుతుందని అన్నాడు. ఐదారు స్టార్ హీరోలున్న ఇండస్ట్రీలో ఇయర్ కు 1 సినిమానే చేస్తున్నా అన్ని సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము మేము బాగానే ఉంటాం మీలో కూడా అది ఉండాలి అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు మహేష్. ఇక సినిమా తన కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అన్నారు. ఏప్రిల్ 20 తన మదర్ ఇందిరా బర్త్ డే రోజు కాబట్టి సినిమాను ఆరోజు రిలీజ్ చేస్తున్నామని అన్నారు.