బహిరంగ సభకు ఎన్టీఆర్ ఫిక్స్..!

అసలే రాజకీయ వేడితో ఉన్న తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ బహిరంగ సభకు ఎన్.టి.ఆర్ అటెండ్ అవబోతున్నాడని టైటిల్ చూసి కాస్త ఆశ్చర్యపడొచ్చు. ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యే బహిరంగ సభ మరేదో కాదు భరత్ బహిరంగ సభకే. సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 7న ఎల్బి స్టేడియం జరుగనుంది.

ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అవుతున్నారట. ఒకే వేదికపై ఇద్దరు సూపర్ స్టార్లు అంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పొచ్చు. ఓ స్టార్ సినిమా ఈవెంట్ కు మరో స్టార్ రావడం కూడా ఇదే మొదటిసారి. కొరటాల శివతో ఉన్న సన్నిహితం మహేష్ అంటే ఉన్న అభిమానంతో ఈవెంట్ కు ఇన్వైట్ చేయగానే ఓకే చెప్పాడట ఎన్.టి.ఆర్. ఇక ఇదే ఈఎవెంట్ కు రాం చరణ్ కూడా వస్తాడని అన్నారు. కాని చరణ్ వచ్చే విషయం మీద మాత్రం క్లారిటీ రాలేదు.