కృష్ణ జింక కేసు సల్మాన్ కు ఐదేళ్లు జైలు..!

20 ఏళ్ల క్రితం కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్లు శిక్ష పడింది. రాజస్థాన్ జోధ్ పూర్ న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చింది.  1988నాటి కేసులో గురువారం నాడు సల్మాన్ ఖాన్ ను కోర్ట్ దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది. వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ చట్టం కింద 1972లోని సెక్షన్ 51 ప్రకారం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధించారు.  

ఇదే కేసులో నిందితులుగా ఉన్న సైఫ్ ఆలి ఖాన్, టబు, సోనాలి బింద్రేలను మాత్రం నిర్ధోషులుగా కోర్టు పేర్కొంది. సల్మాన్ ఖాన్ పై వచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సల్మాన్ జైలు శిక్ష ఖారారు కాగానే మంధనా రిటైల్స్ వెంచర్స్ షేర్లు భారీగా తగ్గాయి. సల్మాన్ ఖాన్ ఏర్పరచిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ తో 2010లో మంధనా రిటైల్స్ ఒప్పందం కుదుర్చుకుంది.