
మెగా మేనళ్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరం తేజ్ కెరియర్ మొదట్లో సూపర్ హిట్లు కొట్టినా ప్రస్తుతం హిట్ కోసం మొహం వాచి ఉన్నాడు. తిక్క నుండి రీసెంట్ గా వచ్చిన ఇంటిలిజెంట్ వరకు సినిమా తీస్తే ఫ్లాప్ అన్నట్టు ఉంది తేజు పరిస్థితి. ప్రస్తుతం కరుణాకరణ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్.
ఈ సినిమాకు నిర్మాతగా కె.ఎస్ రామారావు వ్యవహరిస్తున్నారు. సెలెక్టెడ్ సినిమాలను చేసే ఈయన నిర్మాత అనగానే సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా అందమైన చందమామ అని పెట్టబోతున్నారట. అయితే ఈ ఒక్క టైటిలే కాదు తేజూ.. ఐ లవ్ యూ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట.
మరి చూస్తుంటే తేజూ నిజంగానే ఈ సినిమాతో హిట్ అందుకునేలా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా కన్ ఫాం చేశాడు మెగా మేనళ్లుడు. ఆ సినిమాకు మాత్రం చిత్రలహరి టైటిల్ ఫిక్స్ చేశారు.