100 కోట్ల రంగస్థలం..!

చిట్టిబాబుగా రాం చరణ్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సుకుమార్ రంగస్థలం హిట్ మోత బాగానే మోగిస్తున్నాడు. రిలీజ్ అయిన మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా యూఎస్ లో ఆల్రెడీ 2 మిలియన్ క్రాస్ చేసి చరణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. రెండు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన రంగస్థలం సోమవారం సెకండ్ షో ముగిసే సరికి ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

కేవలం 4 రోజుల్లో 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి రంగస్థలం సరికొత్త రికార్డును సృష్టించింది. బాహుబలి బిగినింగ్ ఇంకా పార్ట్ 2 తర్వాత ఇంత వేగంగా 100 కోట్ల కలక్షన్స్ రాబట్టిన సినిమా ఇదే అని చెప్పుకోవాలి. ఇక ధ్రువతో 50 కోట్ల క్లబ్ లోకి చేరిన చరణ్ రంగస్థలంతో ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు. స్టార్ హీరోగా ప్రయోగాలకు తాను కూడా సిద్ధమే అంటూ చిట్టిబాబు పాత్రలో నట విశ్వరూపం చూపించాడు రాం చరణ్. సినిమా ఇంకా వసూళ్ల బీభత్సం సృష్టించడం ఖాయమని అంటున్నారు.