ఎన్టీఆర్ బయోపిక్.. చంద్రబాబుగా ఆయనేనా..!

నందమూరి బాలకృష్ణ హీరోగా తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే గ్రాండ్ గా మొదలైన ఆ సినిమాలో ఇప్పటికే మహేష్ కూడా నటిస్తున్నాడంటూ వార్తలు రాగా ఇప్పుడు సినిమాలో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూడా నటిస్తున్నాడని టాక్ వస్తుంది. ఆయన నటించేది కూడా చంద్రబాబు పాత్రలో అని ప్రచారం జరుగుతుంది.

సినిమాలో బాలయ్య 60 గెటప్పుల్లో నటిస్తాడని తెలుస్తుంది. మొదటి రోజే దానవీరశూరకర్ణలోని దుర్యోధన గెటప్ లో ఆకట్టుకున్నారు. మరి ఈ సినిమా కాస్టింగ్ పై వస్తున్న వార్తలన్ని ఎంతవరకు వాస్తవం అన్నది చూడాల్సి ఉంది. బయోపిక్ సినిమానే అయినా కమర్షియల్ సినిమా ఫార్మెట్ లోనే ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా నడిపిస్తున్నారట. తేజ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా దసరా వరకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.