
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఓ పిక్ లీక్ అయ్యింది. అది కూడా నరసింహారెడ్డి అతని భార్యతో ఉన్న పిక్ రివీల్ అయ్యింది.
ఇది ఎవరో రివీల్ చేశారనుకుంటే పొరపాటే.. చిత్రయూనిట్ ఈ పిక్ లీక్ చేసింది. అయితే అందులో చిరు లుక్ అచ్చం బాహుబలి లానే ఉంది. రాజుల కాలం నాటి కథ కాబట్టి అది రిఫరెన్స్ అయ్యుంటుంది కాని విమర్శకులు మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు. నరసింహారెడ్డి చరిత్ర జరిగిన కథ దానికి బాహుబలికి సంబంధం ఉండదు. కాస్టూంస్ లుక్ ఒకేలా ఉన్నంత మాత్రానా బాహుబలితో పోల్చడం సరికాదని అంటున్నారు.