
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ అని చెబుతున్న ఈ సినిమా స్పెయిన్ లో ఓ సాంగ్ పూర్తి చేసుకుని రావాల్సి ఉంది. అయితే స్పెయిన్ పాటతో షూటింగ్ పూర్తని అంటున్నా ఇంకా సినిమాకు మరో షెడ్యూల్ జరగాల్సి ఉందని లేటెస్ట్ టాక్. ఏదైనా ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉందేమో అంటే అదేం కాదు సినిమాలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తీయాల్సి ఉన్నాయని తెలుస్తుంది.
ఏప్రిల్ 7న ఆడియో రిలీజ్ ప్లాన్ చేయగా.. ఆ తర్వాత రెండు వారాలు ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. మరి అలాంటిది ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. ఓ పక్క భరత్ అనే నేను సినిమాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటికి గట్టి సమాధానమే చెప్పాల్సి ఉన్నాడు మహేష్. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి.