అన్న కోసం రాలేదు కాని..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం అన్నదమ్ములు ఇద్దరు ఎంత మంచి సఖ్యతతో ఉంటారో తెలిసిందే. ఎన్.టి.ఆర్ క్రేజ్ ను తన సినిమాలకు ఉపయోగపడేలా చేసుకుంటున్న కళ్యాణ్ రాం నిర్మాతగా ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ తీసి హిట్ అందుకున్నాడు. ఇక ఈమధ్య వచ్చిన ఎం.ఎల్.ఏ సినిమా కళ్యాణ్ రాం హీరోగా వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ అటెండ్ అవ్వాల్సి ఉంది.

త్రివిక్రం సినిమా కోసం వర్కవుట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్ తన లుక్ రివీల్ చేయించడం కుదరని అన్న కళ్యాణ్ రాం సినిమా ఈవెంట్ డుమ్మా కొట్టాడు. తారక్ రాడని తెలిసి బాలకృష్ణ అయినా వస్తాడని ఆశపడ్డ నందమూరి ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అయితే అన్న కోసం రాని ఎన్.టి.ఆర్ ఐపిఎల్ యాడ్స్ కోసం మాత్రం కెమెరా ముందుకు వచ్చాడు. త్రివిక్రం డైరక్షన్ లో ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ జరుగుతుంది. స్టార్ మా కోసం ఎన్.టి.ఆర్ ఈ యాడ్స్ చేస్తున్నాడు. మరి విషయం ఏదైనా సరే సంధు దొరికితే చాలు ఆడేసుకుంటున్న గాసిప్పు రాయుళ్లకు ఈ మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది.